ఘజియాబాద్ అక్కాచెల్లెళ్ల కేసు.. అప్పుడు ప్రియురాలు.. ఇప్పుడు కూతుళ్లు..
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:27 PM
ఘజియాబాద్ ముగ్గురు అక్కాచెల్లెళ్ల కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది. చేతన్ కుమార్‌కు ఓ ప్రియురాలు కూడా ఉండేదని తెలుస్తోంది..
ఇంటర్‌నెట్ డెస్క్: ఘజియాబాద్ ముగ్గురు అక్కాచెల్లెళ్ల కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పఖీ, ప్రాచీ, నిషికల తండ్రి చేతన్ కుమార్‌కు ఇద్దరు భార్యలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, పోలీసుల దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది. చేతన్ కుమార్‌కు ఓ ప్రియురాలు కూడా ఉండేదని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేతన్ ఆమెతో సహజీవనం చేసేవాడు. అయితే, 2015లో ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. షాహిబాబాద్, రాజేంద్ర నగర్ కాలనీలోని ఇంటి పైకప్పు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చేతన్ కుమార్‌ను విచారించారు.
చేతన్ ప్రియురాలి మరణంలో ఎలాంటి ఫౌల్ ప్లే లేదని, అది ఆత్మహత్యేనని తేలటంతో పోలీసులు కేసును క్లోజ్ చేశారు. అయితే, సరిగ్గా ఐదేళ్ల తర్వాత చేతన్ ప్రియురాలిలాగే కూతుళ్లు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. 9వ అంతస్తులోని ఇంటి కిటికీ నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు పాత కేసును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. పిల్లల మానసిక పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా.. పఖి, ప్రాచీ, నిషికలు సెల్ ఫోన్‌కు బానిసలుగా మారారు. గంటలు గంటలు ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడేవారు. సోషల్ మీడియాలో కొరియన్ పేర్లతో అకౌంట్ సైతం ఓపెన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. సెల్‌ఫోన్లు లాక్కుని అమ్మేశాడు. ముగ్గురికీ పెళ్లి చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో భయపడిపోయిన వారు ప్రాణాలు తీసుకున్నారు. చనిపోయే ముందు ఓ డైరీలో సూసైడ్ నోట్ రాశారు. అందులో ‘మేము భారతీయులం కాదు.. కొరియన్స్‌మి. భారతీయులను పెళ్లి చేసుకోం. ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన సలహా వల్లే గెలిచాం: సూర్యకుమార్