Share News

క్రిటికల్‌ మినరల్సే కీలకం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:57 AM

శుద్ధ ఇంధనం, ఆధునిక సాంకేతికతలు, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రిటికల్‌ మినరల్స్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా మారుతున్నాయని...

క్రిటికల్‌ మినరల్సే కీలకం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • యూకే విదేశాంగ మంత్రితో కలిసి జీఎ్‌ససీవో ప్రారంభం

న్యూఢిల్లీ, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): శుద్ధ ఇంధనం, ఆధునిక సాంకేతికతలు, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రిటికల్‌ మినరల్స్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా మారుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించేందుకు క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలో స్వావలంబనకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 4 బిలియన్‌ డాలర్లతో జాతీయ క్రిటికల్‌ మినరల్స్‌ మిషన్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. భారత్‌-యూకే క్రిటికల్‌ మినరల్స్‌ గ్లోబల్‌ సప్లై చైన్‌ అబ్జర్వేటరీ (జీఎ్‌ససీవో) శాటిలైట్‌ కేంద్రాన్ని యూకే విదేశాంగ మంత్రి ఇవెట్‌ కూపర్‌తో కలసి కిషన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుద్ధి, రీసైక్లింగ్‌ వంటి వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం ఈ మిషన్‌ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్‌ మెటీరియల్‌ ఫ్లో మ్యాప్‌ రూపకల్పనలో ఈ అబ్జర్వేటరీ ముఖ్య కేంద్రంగా నిలవనుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, స్థిరమైన, విశ్వసనీయమైన క్రిటికల్‌ మినరల్స్‌ సప్లై చైన్‌ వ్యవస్థ నిర్మాణంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూకే విదేశాంగ శాఖ ప్రతినిధులు, బ్రిటిష్‌ హై కమిషన్‌ అధికారులు, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 05 , 2026 | 05:57 AM