టీవీకేకు మద్దతు ఇస్తున్నాం: డి.రాజా
ABN , Publish Date - May 09 , 2026 | 05:53 AM
‘గవర్నర్ కార్యాలయాన్ని అడ్డుపెట్టుకుని తమిళనాడులో బీజేపీ రాజకీయం చేయాలని చూడటం సరికాదు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో...
న్యూఢిల్లీ, మే 8(ఆంధ్రజ్యోతి): ‘గవర్నర్ కార్యాలయాన్ని అడ్డుపెట్టుకుని తమిళనాడులో బీజేపీ రాజకీయం చేయాలని చూడటం సరికాదు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం తగదు’ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. టీవీకేకు మద్దతు ఇచ్చే విషయమై శుక్రవారం న్యూఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయంలో కమ్యూనిస్టు పార్టీల కీలక సమావేశం జరిగింది. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, సీనియర్ నేత నారాయణ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పాల్గొన్నారు. టీవీకేకు బేషరతుగా మద్దతు ఇవ్వాలని ఈ సమావేశంలో రెండు కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి. అనంతరం రాజా మీడియాతో మాట్లాడారు.
ఇవి కూడా చదవండి...
పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం
కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం