Share News

సీఈసీ పద్మభూషణ్‌కు అర్హులు: పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్

ABN , Publish Date - Sep 25 , 2026 | 10:26 PM

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తోంది. జ్ఞానేశ్ కుమార్ పద్మభూషణ్ అవార్డుకు అర్హులని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య తాజాగా అన్నారు.

సీఈసీ పద్మభూషణ్‌కు అర్హులు: పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్
CEC Gyanesh Kumar, Samik Bhattacharya

ఇంటర్నెట్ డెస్క్: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. అయితే, బీజేపీ మాత్రం సీఈసీకి పూర్తి మద్దతు ఇస్తోంది. జ్ఞానేశ్ కుమార్ పద్మభూషణ్ అవార్డుకు అర్హులని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య అన్నారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీనే సీరియస్‌గా తీసుకోదని ఎద్దేవా చేశారు.

సీఈసీ సారథ్యంలో జరిగిన ఎస్ఐఆర్‌తో పశ్చిమబెంగాల్‌లో చొరబాట్లు, బెదిరింపులకు ఫుల్ స్టాప్ పడిందని అన్నారు. రాష్ట్ర ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోందని చెప్పారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని అన్నారు. ప్రజలు ఎన్నికల సమయంలో స్వేచ్ఛగా ఓటేశారని చెప్పారు. ఇలాంటి ఎన్నికలు పశ్చిమ బెంగాల్‌లో చాలా అరుదుగా జరుగుతాయని చెప్పారు.


దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కాంగ్రెస్ నేతలు నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘంలో ఇతర కమిషనర్ల నిర్ణయాల బుల్డోజింగ్ జరుగుతోందని జాతీయ మీడియాలో కథనాలు రావడంతో ప్రతిపక్షాలు సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈసీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఈసీలో చర్చల సందర్భంగా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం కావడం సాధారణమని పేర్కొంది. గత ఏడాది కాలంలో సర్ సహా అన్ని నిర్ణయాలు పూర్తి ఏకాభిప్రాయంతోనే జరిగాయని స్పష్టం చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

సార్.. నోరు తెరవండి.. డీఎంకే అధినేత `స్టాలిన్‌‌పై సీఎం విజయ్ ఫైర్

సీఈసీని తొలగించాలని హస్తం పార్టీ దేశవ్యాప్త నిరసనలు!

Updated Date - Sep 25 , 2026 | 10:33 PM