మోదీ జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలే అడ్డుకున్నారు
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:41 AM
కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు
సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో అప్పటి గుజరాత్ సీఎంపై దర్యాప్తును ఆపించారు
కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ
బెంగళూరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్‌లో కేసులో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీపై దర్యాప్తును నాటి కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులే అడ్డుకున్నారని, ఆయన జైలుకు పోకుండా ఆపారని అన్నారు. ఆ తప్పిదం ఫలితంగానే నేడు కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంటోందని, తాము ఇబ్బందులు పడుతున్నామని వ్యాఖ్యానించారు. బెంగళూరులోని రాష్ట్ర పీసీసీ కార్యాలయంలో జరిగిన సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణ సభలో మొయిలీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో 2009-2011 మధ్య, కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా తాను పనిచేసిన సమయంలో జరిగిన ఘటనలను కాంగ్రెస్ సీనియర్ నేత గుర్తుచేసుకున్నారు