Share News

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు ప్రతిపక్షాల ప్రయత్నం.. వచ్చే వారం పార్లమెంటులో నోటీసు?

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:18 PM

సర్ ప్రక్రియపై అభ్యంతరాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అభింశసనకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు ప్రతిపక్షాల ప్రయత్నం.. వచ్చే వారం పార్లమెంటులో నోటీసు?
CEC Gyanesh Kumar

ఇంటర్నెట్ డెస్క్: సర్ ప్రక్రియపై అభ్యంతరాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు కాంగ్రెస్ సారథ్యంలో ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలతో INDIA కూటమిలో ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం. సీఈసీ అభిశంసన తీర్మానం నోటీసులపై కూడా ప్రతిపక్షం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం పార్లమెంటులో ఈ నోటీసు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

సర్ ప్రక్రియపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు రావడం కలకలం రేపింది. గత 10 నెలల్లో ఎన్నికల కమిషనర్లు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే, ఎన్నికల కమిషన్ మాత్రం అభ్యంతరాలను పక్కన పెట్టి సర్‌ ప్రక్రియపై ముందుకెళ్లినట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ అంశాల ఆధారంగా కూడా సీఈసీ అభిశంనకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.


అయితే, ఎన్నికల సంఘం మాత్రం ఈ కథనాలను కొట్టిపారేసింది. ఎన్నికల కమిషనర్లు తమ అభ్యంతరాలను అధికారికంగా వ్యక్తం చేశారన్న వాదనను తోసిపుచ్చింది. సమగ్ర ఓట్ల సవరణ (సర్) సహా అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతో తీసుకున్నవేనని స్పష్టం చేసింది.

గతంలో కూడా ప్రతిపక్షాలు సీఈసీ అభిశంసనకు పార్లమెంటులో నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సీఈసీ తీరు సరికాదని మొత్తం 73 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులపై సంతకాలు చేశారు. తమ నోటీసులో మొత్తం 9 రకాల ఆరోపణలు చేశారు. నాటి నోటీసు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం కొత్తగా మరోసారి అభిశంసన నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు అభిజీత్ దీప్కే అల్టిమేటమ్.. 48 గంటల్లో రాజీనామా చేయకపోతే..

ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్

Updated Date - Sep 24 , 2026 | 05:34 PM