Share News

ఖర్గేకు మరోసారి రాజ్యసభ అవకాశం

ABN , Publish Date - Jun 05 , 2026 | 06:17 AM

రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్‌ తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏడుగు రి పేర్లతో గురువారం జాబితాను విడుదల చేసింది. వీరిలో కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే, పవన్‌ఖేరా...

ఖర్గేకు మరోసారి రాజ్యసభ అవకాశం

  • కర్ణాటక నుంచే మళ్లీ బరిలో.. ఆ రాష్ట్రం నుంచి పవన్‌ఖేరాకు కూడా..

  • మీనాక్షికి మధ్యప్రదేశ్‌ నుంచి అవకాశం

  • ఏడుగురితో కాంగ్రెస్‌ జాబితా విడుదల

న్యూఢిల్లీ, జూన్‌ 4: రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్‌ తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏడుగు రి పేర్లతో గురువారం జాబితాను విడుదల చేసింది. వీరిలో కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే, పవన్‌ఖేరా, మన్సూర్‌ అలీఖాన్‌, మధ్యప్రదేశ్‌ నుంచి మీనాక్షి నటరాజన్‌, రాజస్థాన్‌ నుంచి నీరజ్‌ డాంగి, తమిళనాడు నుంచి ప్రవీణ్‌చక్రవర్తి, జార్ఖండ్‌ నుంచి ప్రణవ్‌ ఝా ఉన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఇప్పటికే పార్టీ రాజ్యసభాపక్ష నేతగా ఉన్న విషయం తెలిసిందే. ఎంపీగా ఆయన పదవీకాలం ముగియనున్న దృష్ట్యా మరోసారి పార్టీ అవకాశం కల్పించింది. తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ అన్నాడీఎంకే ఎంపీ రాజీనామాతో ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థా నాన్ని ఆ రాష్ట్ర సీఎం, టీవీకే పార్టీ అధినేత విజయ్‌.. తమ కూటమి భాగస్వామి కాంగ్రె్‌సకు కేటాయించటం విశేషం. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ ‘డేటా విశ్లేషణ, ప్రొఫెషనల్స్‌ విభాగం’ అధ్యక్షుడు ప్రవీణ్‌ చక్రవర్తి బరిలో నిలిచారు. కాగా, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలకు కర్ణాటక నుంచి పార్టీ అవకాశం కల్పిస్తుందన్న ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఆమెకు అవకాశం దక్కలేదు. 10 రాష్ట్రాల పరిధిలో ఖాళీ అవుతున్న 24 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఏపీ (4), గుజరాత్‌ (4), కర్ణాటక (4), మధ్యప్రదేశ్‌ (3), రాజస్థాన్‌ (3), జార్ఖండ్‌ (2), మణిపూర్‌ (1), మేఘాలయ (1), అరుణాచల్‌ ప్రదేశ్‌ (1), మిజోరం (1) ఉన్నాయి. తమిళనాడు, ఒడిశాల్లో ఒక్కో స్థానానికి కూడా ఇదే రోజున ఉప ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్‌ 8.

ఇవి కూడా చదవండి:

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 05 , 2026 | 06:17 AM