Share News

పండగ సీజన్‌ వేళ.. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై బాదుడు

ABN , Publish Date - Oct 02 , 2026 | 03:18 AM

పండగ సీజన్‌కు ముందు వ్యాపారులకు గట్టి షాక్‌ ఇస్తూ దేశంలోని వాణిజ్య సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయి.

పండగ సీజన్‌ వేళ..  వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై బాదుడు
commercialgas

19 కేజీల సిలిండర్‌పై రూ. 62 మేర పెంపు

న్యూఢిల్లీ, అక్టోబరు 1: పండగ సీజన్‌కు ముందు వ్యాపారులకు గట్టి షాక్‌ ఇస్తూ దేశంలోని వాణిజ్య సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయి. 19కేజీల ఎల్పీజీ కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల ధరలను చమురు సంస్థలు గురువారం నుంచి పెంచాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ వ్యాపారులపై నిర్వహణ భారం మరింత పెరగనుంది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్‌ ధర రూ.62.50 పెరిగి, రూ.2,810కి చేరింది. ముంబైలో రూ.63 పెరిగి రూ. 2,764, చెన్నైలో రూ.66.50 పెరిగి రూ. 2,983కి ఎగబాకింది. పట్నాలో అత్యధికంగా రూ.71.50 పెరిగి రూ. 3,100కి చేరింది. పండగల వేళ వ్యాపారాలు పుంజుకునే సమయంలో ఈ ధరల పెంపు తమను ఇబ్బందుల్లోకి నెడుతుందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గృహ వినియోగ సిలిండర్‌ ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి.

ఈ వార్తలు కూడా చదవండి

మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి

నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు

Updated Date - Oct 02 , 2026 | 03:18 AM