Share News

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

ABN , Publish Date - May 25 , 2026 | 08:36 PM

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీజీపీ ఎక్స్ అకౌంట్‌ను కేంద్రం బ్లాక్ చేయడాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు
CJP Abhijit Deepke Moves Delhi HC

ఇంటర్నెట్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీజీపీ ఎక్స్ అకౌంట్‌ను కేంద్రం బ్లాక్ చేయడాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జాతీయ భద్రత పేరిట తమ అకౌంట్‌ను స్తంభింపజేయడాన్ని సవాలు చేశారు. అభిజిత్ తరపున అడ్వకేట్ నకుల్ గాంధీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై కోర్టు ఈ వారంలోనే విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


జాతీయ మీడియా కథనాల ప్రకారం, సీజీపీ అకౌంట్‌తో జాతీయ భద్రతకు ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్రం సీజీపీ ఎక్స్ అకౌంట్‌ను బ్లాక్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సీజీపీ అకౌంట్‌ను ఎక్స్ బ్లాక్ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గత నెలలో ఆన్‌లైన్‌లో సెటైరికల్‌ ఉద్యమంగా మొదలైన సీజీపీ యూవతలో భారీ పాప్యులారిటీ సొంతం చేసుకుంది. ఎక్స్ వేదికగా వేల మంది ఫాలోవర్లు వచ్చారు. ఇన్‌స్టాలో కూడా సీజీపీకి లక్షల్లో ఫాలోవర్లు వచ్చిపడ్డారు. యూఎస్ఏలో ఉంటున్న దీప్కే సీజీపీని పొలిటికల్ సెటైర్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

రైతు రుణాల మాఫీ... విజయ్ మరో కీలక నిర్ణయం

చెన్నై ఆయిల్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. బ్యారెళ్లన్నీ వరుసగా పేలడంతో..

Updated Date - May 25 , 2026 | 08:48 PM