Share News

సీజేపీ ఎన్నికల్లో పోటీ చేయనుందా.. క్లారిటీ ఇచ్చిన అభిజీత్ దీప్కే

ABN , Publish Date - Aug 05 , 2026 | 01:16 PM

రాజకీయ ఆరంగేట్రంపై సీజేపీ పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే తాజాగా క్లారిటీ ఇచ్చారు.

సీజేపీ ఎన్నికల్లో పోటీ చేయనుందా.. క్లారిటీ ఇచ్చిన అభిజీత్ దీప్కే
Abhijeet Dipke

ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించిన కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) రాజకీయ ఆరంగేట్రంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తాజాగా క్లారిటీ ఇచ్చారు. పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారే ఉద్దేశం తమకు లేదని బుధవారం స్పష్టం చేశారు. నేరుగా ఎన్నికల బరిలోకి దిగేకంటే ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రెషర్ గ్రూప్‌గా కొనసాగుతామని పేర్కొన్నారు. మహారాష్ట్రలో తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతానికి సీజేపీ ప్రెషర్ గ్రూప్‌గా కొనసాగుతుంది. భారత్‌కు ఇలాంటి వాటి అవసరం ఉంది’ అని అన్నారు.


అంతకుముందు, సీజేపీ టాప్ నాయకత్వం ఛత్రపతి శంభాజీ నగర్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. ఈ నేపథ్యంలో సీజేపీ రాజకీయ ఆరంగేట్రం చేయొచ్చన్న అంచనాలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ దీప్కే తాజాగా వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా తమ జెన్ జీ మద్దతుదారుల సలహాలు తీసుకున్నాకే తమ దీర్ఘకాలిక ప్రణాళికపై చర్యలు తీసుకుంటామని దీప్కే గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. మొదట ఆన్‌లైన్ ఉద్యమంగా ప్రారంభమైన సీజేపీ ఆ తరువాత పేపర్ లీక్‌పై న్యూఢిల్లీలో క్షేత్రస్థాయిలో నిరసనకు దిగిన విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

పెట్రోల్ బాంబు దాడులకు ప్లాన్.. ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Updated Date - Aug 05 , 2026 | 02:20 PM