Share News

సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధిగా సౌరవ్‌దాస్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:22 AM

సోషల్‌మీడియా సంచలనం కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) తన ఉనికిని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. విద్యావ్యవస్థలో వైఫల్యాలపై ఢిల్లీలో భారీ నిరసన చేపట్టనున్న...

సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధిగా సౌరవ్‌దాస్‌

  • ఢిల్లీ నిరసనలకు ముందు పార్టీ పరిధి విస్తరణ

న్యూఢిల్లీ, జూన్‌ 3: సోషల్‌మీడియా సంచలనం కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) తన ఉనికిని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. విద్యావ్యవస్థలో వైఫల్యాలపై ఢిల్లీలో భారీ నిరసన చేపట్టనున్న నేపథ్యంలో, ముగ్గురు ప్రముఖులను పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించినట్లు మంగళవారం వెల్లడించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే ఈ నెల 6న భారత్‌కు తిరిగి రానున్న నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రముఖ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ సౌరవ్‌దా్‌సను పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించినట్లు కాక్రోచ్‌ పార్టీ ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. న్యాయ, సామాజిక అంశాలు, పరిశోధనాత్మక జర్నలిజంలో మంచి అనుభవం ఉన్న ఈయన, 2025 ఢిల్లీలో జరిగిన కాలుష్య వ్యతిరేకనిరసన ప్రదర్శనల్లో కీలకపాత్ర పోషించారు. రాజకీయ పరిశోధకుడు, రచయిత, ఫిల్మ్‌మేకర్‌ అయిన విజేత దహియాను మరో అధికార ప్రతినిధిగా సీజేపీ నియమించింది. పలు ప్రముఖ యూట్యూబ్‌ ఛానళ్లకు కంటెంట్‌ అందించడం, పుస్తకాలు రచించడంతో పాటు రెండు హర్యానీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతర్జాతీయ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ ‘మెకిన్సే అండ్‌ కంపెనీ’లో పనిచేసిన అశుతో్‌షకు మరో అఽధికార ప్రతినిధిగా సీజేపీ బాధ్యతలు అప్పగించింది.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 05:25 AM