ఆరో తరగతికి ‘త్రిభాష’ వద్దు
ABN , Publish Date - Sep 29 , 2026 | 02:48 AM
సీబీఎస్ఈ ఆరో తరగతి విద్యార్థులకు త్రి భాషా సూత్రం నుంచి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. భాషా విధానంలో మార్పులు పిల్లలకు అదనపు కష్టం కారాదని, విద్య వారికి సౌకర్యవంతంగా ఉండాలని ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఏడాది ఆగి అమలు చేయండి
భాషా విధానంలో మార్పు పిల్లలకు
అదనపు భారం కారాదు
విద్యను వారికి అసౌకర్యంగా మార్చొద్దు
కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
7,8,9 తరగతులకు ఇచ్చినట్టే,
ఆరో తరగతికీ వెసులుబాటు
ఇవ్వాలంటూ సీబీఎస్‌ఈకి ఆదేశాలు
ఏడాది ఆగి అమలు చేయండి..కేంద్రానికి సుప్రీం స్పష్టీకరణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: సీబీఎస్ఈ ఆరో తరగతి విద్యార్థులకు త్రి భాషా సూత్రం నుంచి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. భాషా విధానంలో మార్పులు పిల్లలకు అదనపు కష్టం కారాదని, విద్య వారికి సౌకర్యవంతంగా ఉండాలని ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 7, 8, 9తరగతులను ఈ విధానం నుంచి కోర్టు ఇప్పటికే మినహాయించిన విషయం తెలిసిందే. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ అంశం సోమవారం మరోసారి బెంచ్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ ఏడాది ఆరో తరగతిని త్రిభాషా విధానం పరిధిలోకి తెచ్చామన్నారు. సీబీఎ్‌సఈ పరిధిలోని 99ు విద్యాలయాలు సంసిద్ధత ప్రకటించాయని పేర్కొన్నారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. తాము ఎంచుకున్న భాషలను పిల్లలు అభ్యసిస్తున్న సమయంలో, మధ్య వచ్చి అందులో మార్పులు చేస్తామనడం సబబేనా అని ప్రశ్నించింది. ఉన్నపళంగా తీసుకునే ఇలాంటి నిర్ణయాలతో పిల్లల చదువులు దెబ్బతింటాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. దేశీయేతర భాషగా ఇంగ్లి్‌షను పరిగణించడాన్ని అభ్యంతరపెట్టారు.దీంతో, విధానంలో మార్పు పిల్లలకు అదనపు భారం కారాదని, విద్య వారికి సౌకర్యవంతంగా ఉండాలని జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి వ్యాఖ్యానించారు. గతంలో 7,8,9 తరగతులకు ఇచ్చినట్టే, ఆరో తరగతికీ వెసులుబాటు ఇద్దామన్నారు. వచ్చే ఏడాది నుంచి త్రిభాషా సూత్రం అమలుకు బెంచ్ అనుమతించింది.
ఈ వార్తలు కూడా చదవండి
నేరుగా ప్రధాని మోదీ రాజీనామాను అడగండి.. సీజేపీకి కేజ్రీవాల్ సలహా
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు