Share News

రైతు నేత రాకేశ్ టికాయత్‌తో సీజేపీ నేత అశుతోష్‌ భేటీ.. సమష్టి పోరాటానికి ప్రయత్నాలు

ABN , Publish Date - Jul 29 , 2026 | 03:28 PM

రైతులు, విద్యార్థులు కలిసి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రకటించింది. ఇందుకోసం రైతులు, విద్యార్థులు, యువతతో కూడిన సంయుక్త వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు వెల్లడించింది.

రైతు నేత రాకేశ్ టికాయత్‌తో సీజేపీ నేత అశుతోష్‌ భేటీ.. సమష్టి పోరాటానికి ప్రయత్నాలు
Rakesh Tikait

ఇంటర్నెట్ డెస్క్: రైతులు, విద్యార్థులు కలిసి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రకటించింది. ఇందుకోసం రైతులు, విద్యార్థులు, యువతతో కూడిన సంయుక్త వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీజేపీ ప్రతినిధి అశుతోష్‌, ఇతర విద్యార్థి నేతలు మంగళవారం భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్‌తో పాటు ఇతర రైతు నేతలను కలిశారు.


ఈ సమావేశంలో రైతులు, విద్యార్థులు, యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించే అంశంపై చర్చించారు. సమావేశం అనంతరం అశుతోష్‌ మాట్లాడుతూ.. 'దేశంలోని రైతులు, విద్యార్థులు, యువత కలిసి మోదీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి ప్రశ్నించేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం' అని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలన్న తమ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని సీజేపీ ప్రతినిధులు రాకేశ్ టికాయత్‌ను కోరారు.


ఇవి కూడా చదవండి

ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో గిల్ టాప్.. టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్

జగన్ క్రెడిట్‌ చోరీ చేస్తే జైలుకే.. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సెటైర్

Updated Date - Jul 29 , 2026 | 03:56 PM