Share News

బొద్దింక అంత తేలిగ్గా వెళ్లిపోదు

ABN , Publish Date - Jul 26 , 2026 | 04:21 AM

‘‘మనం భయపడకుండా, ప్రభుత్వానికి తలవంచకుండా నిలబడితే అనుకున్నది సాధించొచ్చు అనేందుకు ఈ రాజీనామా ఒక నిదర్శనం. మనం మాట్లాడటానికే భయపడిపోతే అది ప్రజాస్వామ్యం...

బొద్దింక అంత తేలిగ్గా వెళ్లిపోదు

దీటుగా నిలబడితే ఏదైనా సాధించొచ్చు

ఉద్యమం ముగియలేదు.. ఆరంభమే

ప్రధాన్‌ రాజీనామా తర్వాత దీప్కే

బొద్దింక అంత తేలిగ్గా వెళ్లిపోదు

  • ప్రజాస్వామ్యానికి ఇది ఒక పాఠం: అభిజిత్‌ దీప్కే

న్యూఢిల్లీ, జూలై 25: ‘‘మనం భయపడకుండా, ప్రభుత్వానికి తలవంచకుండా నిలబడితే అనుకున్నది సాధించొచ్చు అనేందుకు ఈ రాజీనామా ఒక నిదర్శనం. మనం మాట్లాడటానికే భయపడిపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? మనం ఓట్లు వేసి పంపించాం కాబట్టే వారు రాజుల్లా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికే ఒక పాఠం. రాజీనామాతో ఉద్యమం ముగిసినట్టు కాదు. ఇది మొదటి వికెట్‌. ఇది ఆరంభమే’’అని కేంద్ర విద్యా మంత్రి పదవికి ప్రధాన్‌ రాజీనామా అనంతరం జంతర్‌మంతర్‌ వద్ద వేలాది మంది విద్యార్థులను ఉద్దేశించి కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే ప్రకటించారు. ‘బొద్దింక ఒక్కసారి ప్రవేశిస్తే, అంత తేలిగ్గా అది వెళ్లిపోదు’(చివరి వరకూ పోరాడుతుందన్న అర్థంలో) అంటూ తన ఉద్యమానికి నేపథ్యమైన బొద్దింకను ఉదహరించారు. తన పిలుపునకు ప్రజాదరణ రావడం కాకుండా.. యువత ఆకాంక్షలు, అవసరాలను నెరవేర్చడంలో రాజకీయ వ్యవస్థ వైలఫ్యం ఫలితంగానే ఇంత స్పందన వచ్చిందన్నది ఆయన అభిప్రాయం. ‘‘తాము తలచుకుంటే ఎవరితో అరునా రాజీనామా చేయించగలమని యువత నిరూపించింది. ఈ ప్రభుత్వం ఎవరు చెప్పేదీ వినదన్న అభిప్రాయం తప్పని రుజువైంది. హిందూ-ముస్లిం రాజకీయాల ఉచ్చులో పడిపోకుండా, అంశాల వారీ పోరాడితే అధికార పీఠాలను కదిలించొచ్చు’’అంటూ విజయ నినాదాలు చేస్తున్న యువతకు దీప్కే సందేశం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న నీట్‌ విద్యార్థుల పేర్లను చదువుతూ (వారిలో ఒక తెలుగు విద్యార్థిని కూడా ఉన్నారు), వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మంత్రి రాజీనామాను వారు సాధించిన విజయంగానే పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 04:21 AM