కోర్టుల ఆధునికీకరణకు రూ. 50 వేల కోట్లు
ABN , Publish Date - May 13 , 2026 | 05:11 AM
దేశవ్యాప్తంగా న్యాయస్థానాల రూపురేఖలు మార్చేందుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కొత్త ప్రణాళిక సిద్థం చేశారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన...
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రతిపాదన
న్యూఢిల్లీ, మే 12 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా న్యాయస్థానాల రూపురేఖలు మార్చేందుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కొత్త ప్రణాళిక సిద్థం చేశారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక పరిజ్ఞానం పెంపు కోసం రూ.40 వేలకోట్ల నుంచి రూ. 50 వేలకోట్ల నిధులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిధుల వినియోగం, అవసరాలపై అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలో ఒక ప్రత్యేక సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి, ఆగస్టు 31లోగా తన నివేదికను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్‌కు సమర్పించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News