Share News

‘వన్‌ కేస్‌ వన్‌ డాటా’ను ప్రారంభించిన సీజేఐ

ABN , Publish Date - May 12 , 2026 | 04:54 AM

వివిధ కోర్టుల్లో ఉన్న కేసులకు సంబందించి న్యాయ సమాచారాన్ని ఒకే ఛత్రం కింద తీసుకొచ్చేందుకు నిర్దేశించిన ‘వన్‌ కేస్‌ వన్‌ డాటా’ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌...

‘వన్‌ కేస్‌ వన్‌ డాటా’ను ప్రారంభించిన సీజేఐ

  • కోర్టుల్లోని న్యాయ సమాచారమంతా ఒకే ఛత్రం కిందకు

  • కక్షిదారులకు సహాయకారిగా ‘సు సహాయ్‌’ చాట్‌బాట్‌

న్యూఢిల్లీ, మే 11: వివిధ కోర్టుల్లో ఉన్న కేసులకు సంబందించి న్యాయ సమాచారాన్ని ఒకే ఛత్రం కింద తీసుకొచ్చేందుకు నిర్దేశించిన ‘వన్‌ కేస్‌ వన్‌ డాటా’ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సోమవారం ప్రారంభించారు. దేశంలోని అన్ని స్థాయి కోర్టులు అంటే.. తాలూకా స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ఉన్న సమాచారం అంతా ‘వన్‌ కేస్‌ వన్‌ డాటా’ కిందకు వస్తుంది. దీని కింద.. ఒకే కేసుకు సంబంధించి హైకోర్టులు, జిల్లా కోర్టులు, తాలుకా కోర్టుల్లో ఉన్న సమాచారం అంతా అందరికీ అందుబాటులో ఉంటుందని జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు ‘వన్‌ కేస్‌ వన్‌ డాటా’ కింద కేసులు జాప్యం జరగకుండా వేగంగా పరిష్కారమవుతాయని, కేసు స్థితిగతులను న్యాయస్థానాలు సులభంగా గుర్తించే అవకాశం లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కక్షిదారులకు కేసులకు సంబంధించి సమాచారాన్ని, కోర్టు సేవలను సులభంగా పొందేందుకు ఏఐ ఆధారిత ‘సు సహాయ్‌’ చాట్‌బాట్‌ను జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రారంభించారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సౌజన్యంతో నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ‘సు సహాయ్‌’ను అభివృద్ధి చేసిందని ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..

సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్

Updated Date - May 12 , 2026 | 04:54 AM