Share News

ఎన్‌ఎల్‌ఎస్ఐయూ స్నాతకోత్సవానికి సీజేఐ

ABN , Publish Date - Oct 08 , 2026 | 01:37 AM

బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్ఐయూ) స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ హాజరు కానున్నారు.

ఎన్‌ఎల్‌ఎస్ఐయూ  స్నాతకోత్సవానికి సీజేఐ
suryakanth cji

  • జస్టిస్‌ సూర్యకాంత్‌ రాకను గతంలో వ్యతిరేకించిన విద్యార్థులు

బెంగళూరు, అక్టోబరు 7: బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్ఐయూ) స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ హాజరు కానున్నారు. ఈ నెల 17న ఎన్‌ఎల్‌ఎస్ఐయూ 34వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీజేఐ హాజరవుతారని యూనివర్సిటీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ యూనివర్సిటీకి సీజేఐ చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తారు. ఆ హోదాలోనే ఆయన కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే, స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటి, థియేటర్‌ ఆర్టిస్ట్‌ అరుంధతి నాగ్‌ హాజరవుతారని వ ర్సిటీ వెల్లడించింది. ప్రధాన వక్త కూడా ఆమేనని పేర్కొంది. ఈ స్నాతకోత్సవం గత నెల 12వ తేదీనే జరగాల్సి ఉంది. కానీ, నిరుద్యోగులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించరాదని వర్సిటీలోని దాదాపు 700 మంది ప్రస్తుత, పూర్వ విద్యార్థులు యాజమాన్యానికి లేఖ రాశారు. దీంతో స్నాతకోత్సవాన్ని వాయిదా వేసిన వర్సిటీ.. తాజాగా ఈ నెల 17న నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ వార్తలు కూడా చదవండి

శివరాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం.. ముఖానికి అతి సమీపాన పేలిన టపాసులు

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..

Updated Date - Oct 08 , 2026 | 01:38 AM