Share News

అరుదైన కోతి పెంపకం..వివాదంలో విక్రమ్‌!

ABN , Publish Date - Aug 12 , 2026 | 07:31 AM

అరుదైన వన్యప్రాణిని ఇంట్లో పెంచుకుంటున్నారనే ఆరోపణలతో ప్రముఖ నటుడు ‘చియాన్‌’ విక్రమ్‌ వివాదంలో చిక్కుకున్నారు....

అరుదైన కోతి పెంపకం..వివాదంలో విక్రమ్‌!

  • వీడియో వైరల్‌ కావడంతో అటవీశాఖ ఆరా

చెన్నై, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): అరుదైన వన్యప్రాణిని ఇంట్లో పెంచుకుంటున్నారనే ఆరోపణలతో ప్రముఖ నటుడు ‘చియాన్‌’ విక్రమ్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఓ అరుదైన లార్‌ గిబ్బన్‌ జాతి కోతితో ఆయన ఆడుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడమే ఈ వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో విక్రమ్‌ వద్ద ఈ కోతిని పెంచుకోవడానికి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయో.. లేదో.. తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌కు చెందిన లైకురామ్‌ సింగ్‌ అనే వ్యక్తికి ఈ అరుదైన కోతులను పెంచుకునేందుకు ప్రభుత్వ అనుమతి ఉంది. ఆయన వద్ద ఉన్న ఎనిమిది కోతిపిల్లల్లో మూడింటిని పెరుందురైకు చెందిన వ్యాపారవేత్తకు ఇచ్చారు. వాటిల్లో ఒక దానిని విక్రమ్‌ తీసుకు వచ్చి పెంచుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

Updated Date - Aug 12 , 2026 | 07:31 AM