Share News

బిహార్‌లో సంకీర్ణ భాగస్వామిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:04 AM

బిహార్‌లో మహిళల పట్ల నేరాలు పెరిగిపోతుండటంపై కేంద్ర మంత్రి ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఎల్‌జేపీ(ఆర్వీ) అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

బిహార్‌లో సంకీర్ణ భాగస్వామిగా ఉన్నందుకు   సిగ్గుపడుతున్నా
chirag paswan

  • నేరగాళ్లకు భయం ఉండట్లేదు.. మహిళలపై నేరాలకు అడ్డేలేదు

  • నన్ను మంత్రి పదవి నుంచి తొలగించినా భయపడను

  • కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ(ఆర్వీ) చీఫ్‌ చిరాగ్‌ పాసవాన్‌ వ్యాఖ్యలు

  • ఎన్నికల సంఘం మీదా ఇటీవల విసుర్లు

  • మహిళల పట్ల నేరాలకు అడ్డే లేదు

    పట్నా : బిహార్‌లో మహిళల పట్ల నేరాలు పెరిగిపోతుండటంపై కేంద్ర మంత్రి ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఎల్‌జేపీ(ఆర్వీ) అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తాను బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నానన్నారు. ఇటీవల జమూయ్‌, సమస్తిపూర్‌, బంకా, తదితర జిల్లాల్లో మైనర్‌ బాలికల మీద వరుసగా జరిగిన అత్యాచార యత్నాలను ఆయన ప్రస్తావించారు. ఇవి దేశవ్యాప్తంగా బిహార్‌ పరువు తీశాయన్నారు. ఏ బాలిక మీదైనా చేయి వేయడానికి నేరగాళ్లు వణికిపోయే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని చెప్పారు. పోలీసులు అంటే భయం లేకుండా పోయిందని, ఇలా ఉంటే శాంతి భద్రతలను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. కూటమి భాగస్వామిగా మాట్లాడినందుకు తనకు నోటీసు ఇచ్చినా, తనను పదవి నుంచి పీకేసినా భయపడేది లేదన్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఎన్నికల సంఘం(ఈసీ) విషయంలోనూ ఎన్డీఏ కూటమి వైఖరికి భిన్నంగా మాట్లాడారు. వివిధ వర్గాలు లేవనెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీ మీద ఉందన్నారు. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన గుడ్డిగా ఎవర్నీ సమర్థించే ప్రసక్తే లేదని చెప్పారు. బిహార్‌ సంకీర్ణ భాగస్వామి అయిన ఎల్‌జేపీకి 19మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీల బలం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి

నేరుగా ప్రధాని మోదీ రాజీనామాను అడగండి.. సీజేపీకి కేజ్రీవాల్ సలహా

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Updated Date - Sep 29 , 2026 | 03:04 AM