భారత సరిహద్దుల్లో చైనా జే- 20 యుద్ధ విమానాలు
ABN , Publish Date - Jul 31 , 2026 | 05:53 AM
భారత సరిహద్దుకు సమీపంలో చైనా తన అత్యాధునిక ‘జే-20 (మైటీ డ్రాగన్)’ యుద్ధవిమానాలను మోహరించినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. రాడర్లకు చిక్కకుండా ప్రయాణించగల...
శాటిలైట్ చిత్రాల ద్వారా వెలుగులోకి
ఢిల్లీ, జూలై 30: భారత సరిహద్దుకు సమీపంలో చైనా తన అత్యాధునిక ‘జే-20 (మైటీ డ్రాగన్)’ యుద్ధవిమానాలను మోహరించినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. రాడర్లకు చిక్కకుండా ప్రయాణించగల అత్యాధునిక ‘స్టెల్త్’ సాంకేతికత ఉన్న ఫైటర్ జెట్లు చైనా వైమానిక దళంలో అత్యంత శక్తిమంతమైనవి. వాస్తవాధీన రేఖ సమీపంలోని జింజియాంగ్, డామ్‌జంగ్ వైమానిక స్థావారాల్లో చైనా 12 జెట్లను మోహరించడం గమనార్హం. జూన్ చివరివారం, జూలై ప్రారంభంలో ఈ మోహరింపులు చేపట్టినట్లు వాణిజ్య శాటిలైట్ సంస్థ వాంటోర్ సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. జూలై 9నాటి చిత్రాల ప్రకారం, జింజియాంగ్ ప్రావిన్స్‌లోని హోటన్ ఏయిర్‌బేస్‌లో 8 విమానాలు ఉన్నట్లు తేలింది. ఈ ప్రాంతం లడఖ్‌లోని లేహ్‌కు 389కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక టిబెట్‌లోని డామ్‌జంగ్ వైమానిక స్థావరంలో మరో 4 జే-20 జెట్లను గుర్తించారు. ఈ స్థావరం అరుణాచల్ ప్రదేశ్ (తవాంగ్)కు 344 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండు వారాల వ్యవధిలో ఎత్తయిన సైనిక స్థావరాల్లో 12 యుద్ధవిమానాలు కనిపించడం రక్షణ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి
కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ