Share News

పురోగతిలోనే చాబహర్‌ ప్రాజెక్టు

ABN , Publish Date - May 01 , 2026 | 06:00 AM

ఆంక్షలున్నప్పటికీ వ్యూహాత్మకంగా కీలకమైన చాబహర్‌ పోర్టు నిర్మాణ పనులు నిలకడగా కొనసాగుతున్నాయని భారత్‌లో ఇరాన్‌ రాయబారి డాక్టర్‌ మొహమ్మద్‌ ఫతాలి...

పురోగతిలోనే చాబహర్‌ ప్రాజెక్టు

  • హోర్ముజ్‌లో భారత నౌకలకు ఆటంకాల్లేవు

  • భారత్‌లో ఇరాన్‌ రాయబారి మొహమ్మద్‌ ఫతాలి వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30: ఆంక్షలున్నప్పటికీ వ్యూహాత్మకంగా కీలకమైన చాబహర్‌ పోర్టు నిర్మాణ పనులు నిలకడగా కొనసాగుతున్నాయని భారత్‌లో ఇరాన్‌ రాయబారి డాక్టర్‌ మొహమ్మద్‌ ఫతాలి చెప్పారు. ఈ విషయం లో మీడియాలో వచ్చినవన్నీ ఊహాగానాలేనని ఒక ఆంగ్ల న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తోసిపుచ్చారు. ప్రత్యేకించి మధ్య ఆసి యా, అఫ్ఘానిస్థాన్‌ దేశాలతో వ్యాపార వృద్ధి కోసం భారతదేశానికి చాబహర్‌ పోర్టు కీలకమైనదన్నారు. అంతర్జాతీయంగా ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యం తగ్గలేదని చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి పనులు పూర్తవుతాయని భావిస్తున్నామన్నారు. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా హోర్ముజ్‌ జలసంధి గుండా భారత్‌ సహా మిత్రదేశాల నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్‌ కట్టుబడి ఉందని చెప్పారు. అయితే, నౌకాయాన నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సిక్కులు సహా ఇరాన్‌లో నివసిస్తున్న 10 వేల మంది భారతీయుల హక్కులు, భద్రతకు ఇరాన్‌ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!

పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..

Updated Date - May 01 , 2026 | 06:00 AM