వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం నజర్!
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:06 PM
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌తో ఆన్‌లైన్ మోసాలకు అవకాశం ఏర్పడవచ్చన్న ఆందోళన నడుమ కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌తో ఆన్‌లైన్ మోసాలకు అవకాశం ఏర్పడవచ్చన్న ఆందోళన నడుమ కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఫీచర్‌తో యూజర్ల భద్రత ఎలా ప్రభావితం అవుతుందనే విషయాన్ని అధికారులు నిశితంగా సమీక్షిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
యూజర్ల వ్యక్తిగత గోప్యతను మరింత కట్టుదిట్టం చేసేందుకు యూజర్‌నేమ్ ఫీచర్‌ను తెస్తున్నట్టు వాట్సాప్ మాతృసంస్థ మెటా ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఫోన్ నెంబర్‌ను షేర్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం యూజర్‌నేమ్‌తో ఇతరులతో చాట్ చేసే అవకాశాన్ని ఈ ఫీచర్ కల్పిస్తోంది. ఈ ఫీచర్‌ను వాట్సాప్ ఇప్పటికే కొందరికి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది.
అపరిచితులతో తొలిసారి చాటింగ్ చేసే సమమంలో వ్యక్తిగత భద్రత కాపాడుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని మెటా చెబుతోంది. మెటా ప్రకటన ప్రకారం, యూజర్లు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను ఎంచుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారులు ముందుగా తమ వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఆ తరువాత సెట్టింగ్స్‌లోని ‘సెలెక్టింగ్ యూజర్‌నేమ్’ ఆప్షన్‌ను ఎంచుకుని నచ్చిన పేరును తమ అకౌంట్‌కు పెట్టుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు.
కంటెంట్ క్రియేటర్లు, భారీ సంస్థలు, చిన్న వ్యాపారాలు తమకున్న వివిధ మెటా వేదికలకు ఒకే యూజర్‌నేమ్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఉన్న ఇన్‌స్టా, ఫేజ్‌బుక్ యూజర్ నేమ్‌లను కావాలనుకుంటే వాట్సాప్‌కు వినియోగించుకోవచ్చు. ఇక ఆయా దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ పంపిస్తామని కూడా మెటా తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
రూ.3 కోట్ల లంచం కేసు.. ఐపీఎస్ అధికారి దీపక్ గహ్లావత్ అరెస్ట్
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. ముగ్గురి అరెస్ట్