పరివర్తన్ పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
ABN , Publish Date - Jul 22 , 2026 | 09:45 PM
ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'పరివర్తన్' పథకానికి సంబంధించి బుధవారం మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
న్యూఢిల్లీ, జులై 22: ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'పరివర్తన్' పథకానికి సంబంధించి బుధవారం మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బీఎస్-4, అంతకంటే పాత బస్సులు, ట్రక్కులకే ఈ పథకం వర్తిస్తుందని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కొత్త వాహనాల కొనుగోలుపై పదేళ్లపాటు మోటార్ వాహన పన్ను పూర్తిగా మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం రద్దు చేయనున్నట్లు వెల్లడించింది.
వాహన రుణాలపై ఐదేళ్ల పాటు 5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈవీ కొనుగోలుపై గరిష్ఠంగా రూ. 2.56 లక్షల వన్-టైమ్ బెనిఫిట్ అందించనున్నట్లు ప్రకటించింది. డీజిల్, సీఎన్‌జీ వాహనాలకు ఐదేళ్లపాటు ప్రతినెలా ఇంధన వోచర్లు ఇవ్వనున్నట్లు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం రెండేళ్ల పాటు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
విద్యార్థుల నిరసనతో రాజకీయాలు వద్దు: జేపీ నడ్డా
భయపడితే విజయం దక్కదు.. నిర్భయంగా ఆడండి: శ్రేయస్ అయ్యర్