కేంద్ర ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు!
ABN , Publish Date - Apr 19 , 2026 | 05:23 AM
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. కరువు భత్యాన్ని(డీఏ)ను రెండు శాతం పెంచుతూ...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. కరువు భత్యాన్ని(డీఏ)ను రెండు శాతం పెంచుతూ శనివారం కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో మూలవేతనంపై కరువు భత్యం 60శాతానికి చేరుకుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. 2026 జనవరి ఒకటో తేదీ నుంచే ఈ డీఏ పెంపు అమల్లోకి వస్తుందని.. 50.5 లక్షల మంది ఉద్యోగులు, 68.3 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ.6,791 కోట్లు భారం పడుతుందని వెల్లడించారు. పెరిగిపోయే ధరాభారం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి ఉద్యోగులు/పెన్షనర్లకు అదనపు డీఏను ప్రకటిస్తూ ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
అందుకే పీఎస్ఎల్‌లో ఆడుతున్నా: ఇంగ్లండ్ స్టార్ బౌలర్
ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!