పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు: కేంద్రం
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:25 AM
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయన్న వార్తలను కేంద్రం మరోసారి తోసిపుచ్చింది....
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయన్న వార్తలను కేంద్రం మరోసారి తోసిపుచ్చింది. అటువంటి ఆలోచనేమీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతాశర్మ మంగళవారం మీడియాతో మాట్లాడారు. బుధవారం పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ పోలింగ్‌తో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియనున్నందున.. చమురు రిటైల్ ధరలు పెరుగుతాయా అన్న ప్రశ్నకు పెంచే యోచన లేదని సుజాతాశర్మ వెల్లడించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం జనం భారీ ఎత్తున క్యూ కడుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, చమురు నిల్వలు ఎప్పటికప్పుడు తగినంత ఉండేలా చూస్తున్నామని తెలిపారు. దేశంలో డిమాండ్‌కు తగినంత పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విమాన ఇంధనం నిల్వలు ఉన్నాయన్నారు.
ఇవి కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..