Share News

సీబీఎస్‌ఈ మూల్యాంకనంలో తప్పులు దొర్లాయి: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

ABN , Publish Date - May 28 , 2026 | 01:11 PM

సీబీఎస్ఈ ఫలితాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. సీబీఎస్‌ఈ మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్టు అంగీకరించారు. ఆ తప్పులకు తానే బాధ్యత వహిస్తున్నానని ధర్మేంద్ర ప్రకటించారు.

సీబీఎస్‌ఈ మూల్యాంకనంలో తప్పులు దొర్లాయి: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Dharmendra Pradhan

న్యూఢిల్లీ, మే 28: సీబీఎస్ఈ ఫలితాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. సీబీఎస్‌ఈ మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్టు అంగీకరించారు. ఆ తప్పులకు తానే బాధ్యత వహిస్తున్నానని ధర్మేంద్ర ప్రకటించారు. సీబీఎస్ఈ 12వ తరగతి పత్రాల రీ-వాల్యుయేషన్‌కు ఆదేశించారు. విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఓఎస్ఎమ్ విధానంలో లోపాలున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు, రీవాల్యుయేషన్‌ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఏడాది సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్‌స్ర్కీన్‌ మార్కింగ్‌ విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. పరీక్షలు రాసిన 17లక్షల మంది విద్యార్థుల్లో ఏకంగా 4,04,319 మంది తమకు సంబంధించిన జవాబు పత్రాల స్కాన్‌ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జవాబు పత్రాల స్కాన్‌ కాపీల్లో చాలా వరకు పత్రాలు అస్పష్టంగా (బ్లర్‌) కనిపిస్తుండగా.. మరి కొంతమంది విద్యార్థులకు ఏకంగా వేరొకరి జవాబు పత్రాలు దర్శనమిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

జూన్ 6 వరకు ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయి: మంత్రి వివేక్

చంద్రబాబు బూట్లు తుడిచి మాట్లాడు.. కొడాలి నానిపై ఎమ్మెల్యే రాము ఫైర్

Updated Date - May 28 , 2026 | 01:19 PM