మే 15 నుంచి సీబీఎస్ఈ పదో తరగతి రెండో విడత పరీక్షలు
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:47 AM
సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) పదో తరగతి రెండో విడత (సెకండ్ సెషన్) పరీక్షల షెడ్యూ ల్ విడుదలైంది. మే 15వ తేదీ నుంచి...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) పదో తరగతి రెండో విడత (సెకండ్ సెషన్) పరీక్షల షెడ్యూ ల్ విడుదలైంది. మే 15వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు పదో తరగతి రెండో విడత పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్ఈ గురువారం ప్రకటించింది. సీబీఎస్ఈ ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది. మే నెలలో నిర్వహించే రెండో విడత పరీక్షలను రాయాలా? వద్దా? అనేది విద్యార్థుల నిర్ణయం. తొలివిడత పరీక్షల్లో ఫెయిలైన పేపర్లు లేదా మార్కుల ఇప్రూవ్‌మెంట్ కోసం విద్యార్థులు రెండోవిడత పరీక్షలకు హాజరుకావొచ్చు. ఇప్రూవ్‌మెంట్ కోసం గరిష్ఠంగా ఏవైనా మూడు పేపర్లు ఎంపిక చేసుకొని రాయవచ్చు. రెండు విడతల్లో ఎందులో అత్యధిక మార్కులు వస్తే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి