సీబీఎస్‌ఈ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి మన్‌దీప్ కే భండారీ
ABN , Publish Date - Sep 25 , 2026 | 09:47 PM
సీబీఎస్‌ఈ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి మన్‌దీప్ కే భండారీ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ జీఓ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: సీబీఎస్‌ఈ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి మన్‌దీప్ కే భండారీ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ జీఓ విడుదల చేసింది. అంతేకాకుండా, సీబీఎస్‌ఈ డైరెక్టర్ పోస్టును కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ స్థాయికి అప్‌గ్రేడ్ చేసినట్టు పేర్కొంది. ఓఎస్ఎమ్ వ్యవస్థ వైఫల్యం నేపథ్యంలో ఇటీవల సీబీఎస్‌ఈపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్‌దీప్ కే భండారీ నియామకం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
సమాధాన పత్రాల డిజిటల్ మూల్యాకనం దిశగా క్లాస్ 12 విద్యార్థులకు 2026లో ఓఎస్ఎమ్ పద్ధతిని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ విధానంలో విద్యార్థుల ప్రశ్నపత్రాలను స్కాన్ చేసి డిజిటల్ కాపీలతో మూల్యాంకానికి చేస్తారు. ఈ తరహా మూల్యాంకనంపై సీబీఎస్ఈ టీచర్లకు శిక్షణ ఇచ్చింది. మాక్ ఎక్సర్‌సైజులు నిర్వహించింది. అయితే, తమ సమాధాన పత్రాల డిజిటల్ కాపీల్లో సమస్యలు ఉన్నాయని విద్యార్థులు నుంచి ఫిర్యాదులు అందడంతో వివాదం మొదలైంది.
ఇక 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన భండారీ గతంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. కేంద్రంతో పాటు జమ్మూకశ్మీర్‌లో కూడా కీలక పాలనాపరమైన విధులు నిర్వహించారు. ఆయన ఎంబీబీఎస్ చేశారు. శ్రీమాతా వైష్ణో దేవీ ఆలయ బోర్డులో సీఈఓగా కూడా చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
సార్.. నోరు తెరవండి.. డీఎంకే అధినేత స్టాలిన్‌పై సీఎం విజయ్ ఫైర్
సీఈసీని తొలగించాలని హస్తం పార్టీ దేశవ్యాప్త నిరసనలు!