Share News

సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌కు 3 నెలల జైలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:22 AM

సోదాల సందర్భంగా ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారిపై దాడి చేశారన్న కేసులో సీబీఐ ప్రస్తుత జాయింట్‌ డైరెక్టర్‌ రమనీష్‌కు...

సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌కు 3 నెలల జైలు

  • మరో మాజీ అధికారికి కూడా... 26 ఏళ్ల నాటి కేసులో తీర్పు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28: సోదాల సందర్భంగా ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారిపై దాడి చేశారన్న కేసులో సీబీఐ ప్రస్తుత జాయింట్‌ డైరెక్టర్‌ రమనీష్‌కు స్థానిక కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. మరో సీబీఐ మాజీ అధికారి వి.కె.పాండేకూ ఇదే శిక్ష వేసింది. రూ.50వేల వంతున జరిమానా కూడా విధించింది. 26 ఏళ్ల నాటి ఈ కేసులో జ్యుడీషియల్‌ మేజిస్ట్రేటు శశాంక్‌ నందన్‌ భట్‌ ఈ మేరకు తీర్పు వెలువరించారు. రమనీష్‌ సీబీఐ ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో 2000 సంవత్సరం అక్టోబరు 19న సోదాల నిమిత్తం పశ్చిమ విహార్‌లో ఉంటున్న ఐఆర్‌ఎస్‌ అధికారి అశోక్‌ కుమార్‌ అగర్వాల్‌ ఇంటికి వెళ్లారు. అయితే తెల్లవారు జామున సోదాలకు వచ్చి, తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ అగర్వాల్‌ ఫిర్యాదు చేశారు. అరెస్టు సందర్భంగా నిబంధనలు పాటించలేదని, తనపై దాడి చేశారని తెలిపారు. వాదనతో ఏకీభవించిన కోర్టు సీబీఐ అధికార్లకు శిక్ష విధించింది.

ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 29 , 2026 | 06:22 AM