రూ.661 కోట్ల ప్రభుత్వ నిధుల మళ్లింపు
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:07 AM
ప్రభుత్వ నిధులను అధికారుల సొంత ప్రయోజనాలకు మళ్లించారన్న కేసులో సీబీఐ ఆదివారం ఆరు చోట్ల దాడులు చేసింది. హరియాణా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు చండీగఢ్...
న్యూఢిల్లీ, జూన్ 7: ప్రభుత్వ నిధులను అధికారుల సొంత ప్రయోజనాలకు మళ్లించారన్న కేసులో సీబీఐ ఆదివారం ఆరు చోట్ల దాడులు చేసింది. హరియాణా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు ఐడీఎ్‌ఫసీ బ్యాంకు, ఏయూ ఫైనాన్స్ బ్యాంకుల సిబ్బందితో కుమ్మక్కయి ఏకంగా రూ.661 కోట్లను దారి మళ్లించినట్టు కేసు నమోదు చేసింది. ఇందుకు విపం కన్సల్టెన్సీ అనే సంస్థ సహకారం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో చండీగఢ్, పంచకుల, ఢీల్లీ-ఎన్‌సీఆర్, నోయిడాల్లో ఆరు చోట్ల ప్రభుత్వ అధికారులకు చెందిన ఇళ్లల్లో సోదాలు చేసింది. నోయిడాలోని విపం కన్సల్టెన్సీ కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్ నివాసాలపైనా దాడులు చేసింది. ఎనిమిది విభాగాలకు చెందిన నిధులు దుర్వినియోగమయినట్టు సీబీఐ గుర్తించింది. బ్యాంకు అధికారుల సాయంతో ఒక పద్ధతి ప్రకారం నిధులను తొలుత విపం కన్సల్టెన్సీకి మళ్లించి, అనంతరం అధికారులు సొంతానికి ఉపయోగించుకున్నారని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News