Share News

సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ పదవీ కాలం మరో ఏడాది పాటు పొడిగింపు

ABN , Publish Date - May 14 , 2026 | 05:20 AM

సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ పదవీ కాలాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. ఈ నెల 24వ తేదీతో ఆయన పదవీకాలం ముగియనుండటంతో.. మరో ఏడాది ఆయన ...

సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ పదవీ కాలం మరో ఏడాది పాటు పొడిగింపు

న్యూఢిల్లీ, మే 13: సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ పదవీ కాలాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. ఈ నెల 24వ తేదీతో ఆయన పదవీకాలం ముగియనుండటంతో.. మరో ఏడాది ఆయన సేవలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రవీణ్‌ సూద్‌ను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు ఎంపిక కమిటీ చేసిన సిఫార్సులకు క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులో పేర్కొంది. గతేడాది ఆయనకు మొదటిసారి ఏడాది పొడిగింపునిచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ మంగళవారం సమావేశమైన అనంతరం ప్రవీణ్‌ సూద్‌ పదవీకాలాన్ని పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఎంపిక ప్రకియపై ఇప్పటికే రాహుల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

Updated Date - May 14 , 2026 | 07:20 AM