హోర్ముజ్ నుంచి భారత నౌకలకు అనుమతి
ABN , Publish Date - Apr 20 , 2026 | 07:33 AM
భారత్-ఇరాన్ మధ్య చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ తెలిపారు. భారత్, ఇరాన్ మధ్య ఐదువేల ఏళ్లుగా గల సాంస్కృతిక, వారసత్వ, ఆర్థిక, విద్యా...
ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి మజీద్
భారత్-ఇరాన్ మధ్య చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ తెలిపారు. భారత్, ఇరాన్ మధ్య ఐదువేల ఏళ్లుగా గల సాంస్కృతిక, వారసత్వ, ఆర్థిక, విద్యా సంబంధాలను కొనసాగిస్తున్నామన్నారు. ఆదివారం ఆయన దారుల్‌షిఫాను సందర్శించి నమాజు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి, ఇరాన్ సుప్రీం లీడర్‌కు మధ్య పలుమార్లు ఫోన్‌లో ఫలప్రదమైన చర్చలు జరిగాయన్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల వల్ల హుర్మోజ్ జలసంధి నుంచి భారత్‌కు చెందిన చమురు, గ్యాస్ నౌకలను అనుమతిస్తున్నట్లు అబ్దుల్ మజీద్ తెలిపారు. ఇప్పుడు యుద్దం ఆగాలంటే ఇరుపక్షాల మధ్య షరతుల్లేని అర్థవంతమైన చర్చలు జరగాల్సి ఉందన్నారు. తాము యుద్ధం కోరుకోకున్నా.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆత్మరక్షణకు పాల్పడుతూనే ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. శాంతిని కోరుకుంటూ చర్చలకు సిద్ధమే కానీ, షరతులను అంగీకరించబోమన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో