ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:28 AM
మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌సిసోడియా, కల్వకుంట్ల కవితతో పాటు మద్యం కుంభకోణం కేసులో 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌సిసోడియా, కల్వకుంట్ల కవితతో పాటు మద్యం కుంభకోణం కేసులో 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఎలాంటి నేరపూరిత ఉద్దేశం కానీ, కుట్ర కానీ లేదని.. సీబీఐ సమర్పించిన సాక్ష్యాలు న్యాయ పరీక్షకు నిలవవని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి జితేంద్రసింగ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని, హవాలా మార్గంలో నిధుల బదిలీకి సాక్ష్యాధారాలున్నాయని, కుంభకోణంలో పాత్రధారులు పలుమార్లు కలిశారని తాము సాక్ష్యాలతో పేర్కొన్న కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ భావిస్తోంది. ఈ కేసులో మరింత దర్యాప్తు జరపాల్సి ఉందని సీబీఐ హైకోర్టు ముందు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నట్టు తెలిసింది.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ