సైబర్ స్లేవరీ కేసులో ఇద్దరు అంతర్జాతీయ ముఠా సభ్యుల అరెస్ట్
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:16 PM
మానవ అక్రమ రవాణా, సైబర్ స్లేవరీ నెట్‌వర్క్‌పై సీబీఐ కొరడా ఝుళిపించింది. ఆగ్నేయాసియా స్కామ్ కాంపౌండ్లతో లింకులు ఉన్న ఇద్దరు కీలక నిందితులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
ఢిల్లీ: మానవ అక్రమ రవాణా, సైబర్ స్లేవరీ నెట్‌వర్క్‌పై సీబీఐ కొరడా ఝుళిపించింది. ఆగ్నేయాసియా స్కామ్ కాంపౌండ్లతో లింకులు ఉన్న ఇద్దరు కీలక నిందితులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో గత మే నెలలో 4 రాష్ట్రాల్లోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఒకరిని అరెస్టు చేశారు. తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
బాధితులను బ్యాంకాక్ నుంచి మే సోట్ మీదుగా థాయిలాండ్-మయన్మార్ సరిహద్దు దాటించి స్కామ్ కాంపౌండ్లకు చేర్చిన లాజిస్టిక్స్ హ్యాండ్లర్‌ను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అలాగే థాయిలాండ్-మయన్మార్ సరిహద్దు కాంపౌండ్‌లో ఉంటూ భారత్‌లోని సబ్-ఏజెంట్లను నిర్వహిస్తున్న మరో నిందితుడిని అరెస్టు చేశామన్నారు. విదేశాల్లో భారీ జీతాలతో ఉద్యోగాలంటూ భారతీయులను ఈ అంతర్జాతీయ ముఠా ట్రాప్ చేసినట్లు కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఉద్యోగాల కోసం వచ్చిన వారిని మయన్మార్, కంబోడియా దేశాల్లోని స్కామ్ కాంపౌండ్లకు తరలించారని తెలిపారు. బాధితుల పాస్‌పోర్టులు బలవంతంగా తీసుకుని, వారితో సైబర్ నేరాలు చేయించినట్లు వెల్లడించారు. శారీరక, మానసిక వేధింపులకూ గురి చేసినట్లు చెప్పుకొచ్చారు.
తమను వదిలిపెట్టాలని వేడుకున్న బాధితుల నుంచి భారీగా నగదు వసూళ్లకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌లో వచ్చే విదేశీ ఉద్యోగ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీబీఐ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రిజైన్ చేసి హ్యాపీగా వెళ్లిపోవచ్చు... రెబల్ ఎంపీలకు టీఎంసీ ఘాటు సందేశం
సంతకాల ఫోర్జరీ కేసు.. మమతా బెనర్జీ కార్యాలయానికి సీఐడీ టీమ్