Share News

ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. బ్యూటీపార్లర్ యువతిపై కేసు

ABN , Publish Date - Jul 30 , 2026 | 09:13 PM

జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 25 ఏళ్ల యువతిపై నోయిడా పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. బ్యూటీపార్లర్ యువతిపై కేసు
Case Against Ruchika Singh

ఇంటర్నెట్ డెస్క్: జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యువతి రుచికా సింగ్‌పై (25) నోయిడా పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. స్మృతీ సింగ్ అనే సుప్రీంకోర్టు అడ్వకేట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రుచికా సింగ్ వైరల్ వీడియో తన దృష్టికి రావడంతో ఫిర్యాదు చేసినట్టు స్మృతి సింగ్ తెలిపారు. ప్రధానిపై బహిరంగంగా రుచిక అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని అన్నారు. రాజ్యాంగ పదవి గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా యువతి వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.


రుచికా సింగ్ నోయిడాలోని సెక్టర్‌ 168లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. తొలుత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనంతరం కేసును ఢిల్లీకి బదిలీ చేశారు. అయితే, రుచికా సింగ్ వీడియో వైరల్ అయిన తరువాత ఆమె జాడ తెలియరాలేదు. ఆమె ఒక బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రుచిక కుటుంబసభ్యుల జాడ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అసభ్య వ్యాఖ్యలు చేసిన ఆమె వీడియో వైరల్ కావడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు యువత కుసంస్కారులుగా మారుతున్నారని జనాలు మండిపడ్డారు.


ఈ వార్తలనూ చదవండి:

‘గోమూత్ర నిపుణుడు’ అంటూ వ్యాఖ్య.. ప్రియాంక గాంధీకి విద్యావేత్తల ఘాటు లేఖ

సీఈసీ నియామక చట్టంపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

Updated Date - Jul 30 , 2026 | 09:22 PM