Share News

ఖరీఫ్ సీజన్‌లో న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీగా రూ.41,534 కోట్లు.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:21 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారంనాడు జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్‌ కోసం నూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీగా రూ.41,533.81 కోట్లు కేటాయించారు.

ఖరీఫ్ సీజన్‌లో న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీగా రూ.41,534 కోట్లు.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం
Central Cabinet

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారంనాడు జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్‌ కోసం నూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీగా రూ.41,533.81 కోట్లు కేటాయించారు. ఇది 2025 ఖరీఫ్ సీజన్‌లో బడ్జెటరీ కేటాయింపుల కంటే రూ.4,313 కోట్ల రూపాయలు అధికం. 2025 ఖరీఫ్ బడ్జెట్ రూ.37,216.15 కోట్లుగా ఉంది.


కాగా, జైపూర్ మెట్రో ఫేజ్-2కు కేంద్ర క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. రూ.13,038 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడతారు. ప్రహ్లాద్‌పుర నుంచి తోడి-మోడ్ వరకూ 36 స్టేషన్లను కలుపుతూ 41 కిలోమీటర్ల పొడవైన నార్త్-సౌత్ కారిడార్‌గా దీన్ని నిర్మించనున్నారు. కేంద్ర, రాజస్థాన్ ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా రాజస్థాన్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనిని చేపడుతుంది.


రాజస్థాన్‌లో హెచ్‌పీసీఎల్ రిఫైనర్ కోసం రూ.79,459 కోట్లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కమ్లే, క్రా దాది-కురుంగ్ కుమే జిల్లాల్లో రూ.26,069.50 కోట్లతో 1720 మెగావాట్ల ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు 96 నెలల్లో పూర్తవుతుందని అంచనా వేశారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో 1200 మెగావాట్ల కళాయి-2 హైడ్రో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.14,105.83 కోట్లు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది.


ఇవి కూడా చదవండి..

గోవాలోని పోండా ఉపఎన్నిక రద్దు... ఈసీ నోటీఫికేషన్ చెల్లదని ప్రకటించిన హైకోర్టు

ఈసీతో టీఎంసీ సమావేశంలో రసాభాస.. పరస్పరం ఆరోపణలు

Updated Date - Apr 08 , 2026 | 05:44 PM