బైజూస్ వ్యవస్థాపకుడికి ఆరు నెలల జైలు.. సింగపూర్ కోర్టు తీర్పు..
ABN , Publish Date - May 27 , 2026 | 10:19 AM
బైజూస్ వ్యవస్థపకుడు రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కారణ కేసులో సింగపూర్ న్యాయస్థానం ఈ శిక్ష విధించినట్టు వార్తలు వస్తున్నాయి.
బైజూస్ వ్యవస్థపకుడు రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కారణ కేసులో సింగపూర్ న్యాయస్థానం ఈ శిక్ష విధించినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు భారత స్టార్టప్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఎడుటెక్ సంస్థ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది (Byju's Raveendran).
ఆన్‌లైన్ విద్యా రంగంలో బైజూస్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది (Byju's founder sentence). ముఖ్యంగా కరోనా సమయంలో ఆన్‌లైన్ చదువుల డిమాండ్ భారీగా పెరగడంతో కంపెనీ విలువ 2022 నాటికి 22 బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికా, పశ్చిమాసియా దేశాల్లో పలు సంస్థలను కొనుగోలు చేసి దూసుకెళ్లింది.
2021లో తీసుకున్న 1.2 బిలియన్ డాలర్ల భారీ విదేశీ రుణమే కంపెనీకి పెద్ద సమస్యగా మారింది (Byju's legal battle). ఆడిట్ నివేదికలు ఆలస్యం కావడం, ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమవడం, భారీ నష్టాలు బయటపడటం వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందారు. రుణదాతలు కంపెనీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు చేశారు. పలు దేశాల్లో కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి..