సారీ నాన్నా..! నేను ఓడిపోయాను
ABN , Publish Date - Jul 20 , 2026 | 06:19 AM
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో 50 సార్లు పరీక్షలు రాసి, విజయం సాధించలేకపోయిన ఓ 23 ఏళ్ల బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
50 సార్లు ప్రయత్నించినా దక్కని ప్రభుత్వ కొలువు
మనస్తాపంతో బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య
కాన్పూర్, జూలై 19: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో 50 సార్లు పరీక్షలు రాసి, విజయం సాధించలేకపోయిన ఓ 23 ఏళ్ల బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని గుజైనీలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మరణానికి ముందు అతడు రాసిన ఆత్మహత్య లేఖ అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. తన తండ్రికి పదే పదే క్షమాపణలు చెబుతూ.. ‘‘సారీ నాన్నా.. నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం 50 సార్లు ప్రయత్నించాను. కానీ విజయం సాధించలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి’’ అని ఆ లేఖలో పేర్కొన్నాడు. బిహార్‌లోని బక్సార్‌కు చెందిన ఆనంద్ కుమార్ 2024లో కాన్పూర్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే నిరంతరం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. దాదాపు 50కి పైగా ప్రభుత్వ నియామక పరీక్షలు రాసినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన అతడు.. గుజైనీలో నివసించే అద్డె ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!