Share News

పుతిన్, జిన్‌పింగ్, పెజెష్కియాన్‌లతో.. బ్రిక్స్‌ సదస్సు వేళ ప్రధాని మోదీ కీలక భేటీలు..

ABN , Publish Date - Sep 11 , 2026 | 02:03 PM

భారత్‌ వేదికగా జరగనున్న బ్రిక్స్‌ సదస్సు కోసం వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.

పుతిన్, జిన్‌పింగ్, పెజెష్కియాన్‌లతో.. బ్రిక్స్‌ సదస్సు వేళ ప్రధాని మోదీ కీలక భేటీలు..
PM Modi Bilateral Meetings

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ వేదికగా జరగనున్న బ్రిక్స్‌ సదస్సు కోసం వచ్చే కీలక దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ భేటీలు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. న్యూఢిల్లీలో సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో బ్రిక్స్‌ సదస్సు జరగనుంది (PM Modi Bilateral Meetings).


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. బ్రిక్స్‌ సదస్సుకు ముందు ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, అణు విద్యుత్‌, సాంకేతికత వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో కూడా మోదీ సమావేశం కానున్నారు. ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిస్థితులు, వాణిజ్యం, కనెక్టివిటీ వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది (Modi Putin Meeting).


ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ శనివారం భారత్‌కు రానున్నారు (Modi Xi Jinping Meeting). ప్రధాని మోదీ-జిన్‌పింగ్‌ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మోదీ-జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక సమావేశం గురించి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటన చేసింది. వాస్తవాధీన రేఖ పరిస్థితి, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇరు దేశాల సంబంధాల మెరుగుదల వంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

బ్రిక్స్‌ సదస్సు కోసం ఢిల్లీకి పుతిన్.. నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 11 , 2026 | 02:07 PM