బ్రిక్స్‌లో కీలక పరిణామం.. సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయం..
ABN , Publish Date - Sep 12 , 2026 | 03:06 PM
భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిక్స్ సభ్య దేశాలు సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిక్స్ సభ్య దేశాలు సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రకటనను శనివారం నేతలు అధికారికంగా ఆమోదించే అవకాశం ఉంది (BRICS Summit 2026).
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ విభేదాలను అధిగమించి సంయుక్త ప్రకటనకు అంగీకారం కుదరడం భారత్‌కు కూడా కీలక దౌత్య విజయంగా భావిస్తున్నారు. సంయుక్త ప్రకటనలో ఏ ఒక్క దేశం పేరును ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం లేదు. అయితే ఏ దేశమైనా ఏకపక్షంగా యుద్ధానికి దిగడాన్ని ఖండించే అంశాన్ని ప్రకటనలో చేర్చినట్లు సమాచారం (BRICS Delhi Summit).
ఇరాన్, యూఏఈ రెండు బ్రిక్స్ సభ్య దేశాలే అయినప్పటికీ.. ప్రస్తుత గల్ఫ్ సంక్షోభంలో ఇరు దేశాల వైఖరులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి (BRICS declaration). ఈ పరిస్థితుల్లో ఇరు దేశాలూ అంగీకరించే భాషను సంయుక్త ప్రకటనలో పొందుపరచడం బ్రిక్స్ దౌత్యవేత్తలకు పెద్ద సవాలుగా మారింది. బ్రిక్స్ అధ్యక్ష దేశంగా భారత్‌కు ఈ సదస్సు అత్యంత కీలకం. ఇరాన్‌తోనూ, యూఏఈతోనూ భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి బ్రిక్స్‌లో ఏకాభిప్రాయం సాధించేలా భారత్ చర్చలను ముందుకు నడిపించింది.
ఇవి కూడా చదవండి..
అలా అయితే రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే.. యూరప్‌నకు పుతిన్ వార్నింగ్..
భారత్‌తో విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటాం.. కీలక భేటీకి ముందు చైనా వ్యాఖ్యలు.