Share News

బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్‌కు నిద్రలేని రాత్రులు: అమిత్ షా

ABN , Publish Date - Sep 25 , 2026 | 07:42 PM

లఖ్నవూలో తయారవుతున్న బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్‌కు నిద్రలేని రాత్రులు వచ్చాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. యూపీ డిఫెన్స్ కారిడార్‌లో రక్షణ ఉత్పత్తుల తయారీపై వివరించారు.

బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్‌కు నిద్రలేని రాత్రులు: అమిత్ షా
Home Minister Amit Shah

ఇంటర్నెట్ డెస్క్: లఖ్నవూలో తయారవుతున్న బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్‌కు నిద్రలేని రాత్రులు వచ్చాయని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అమేఠీలో తయారవుతున్న ఏకీ-203 రైఫిల్స్‌తో నక్సలైట్లు, టెర్రరిస్టులకు కూడా కంటిమీద కునుకులేకుండా పోయిందని చెప్పారు. గ్రేటర్ నోయిడాలోని యూపీ ట్రేడ్ షో ప్రారంభోత్సవంలో హోం మంత్రి ప్రసంగించారు.

యూపీ డిఫెన్స్ కారిడార్‌లో భాగమైన ఝాన్సీ, చిత్రకూట్, లఖ్నవూ, ఆగ్రా, అలీగఢ్, కాన్పూర్‌లోకి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఆర్థికంగా పురోగమిస్తోందని అన్నారు. కానీ కొందరు మాత్రం ఈ అభివృద్ధిని చూసి భరించలేకపోతున్నారని చెప్పారు. ప్రధాని మోదీ సారథ్యంలో వివిధ దేశాలతో ఎన్నో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని అన్నారు.


యూపీతో పాటు యావత్ దేశంలో నూతన రక్షణ రంగ ఉత్పత్తులు తయారవుతున్నాయని చెప్పారు. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక యూపీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా మెరుగైందని అన్నారు. యోగి ప్రభుత్వం మాఫియా రాజ్యానికి ముగింపు పలికిందని చెప్పారు. మోదీ సారథ్యంలో దేశంలో రాజకీయ సుస్థిరత ఉందని, ఎలాంటి అవాంతరాలు లేకుండా విధానాలు అమలవుతున్నాయని అన్నారు.

యూపీలో సెప్టెంబర్ 25-29 తేదీల మధ్య జరగుతున్న ఈ ట్రేడ్ షోలో తయారీదార్లు, ఎమ్‌ఎస్ఎమ్‌ఈలు, ఎగుమతిదారులు, చేతివృత్తుల వారు, స్టార్టప్‌లు, అంతర్జాతీయ బయ్యర్లు హాజరవుతున్నారు. ఈ ట్రేడ్ షో ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకెళ్లాలని యూపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


ఈ వార్తలనూ చదవండి:

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ.. సీఈసీపై సుప్రీంకోర్టులో పిల్

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. రెండు వాహనాల ఢీ, ఆరుగురి మృతి

Updated Date - Sep 25 , 2026 | 08:04 PM