Share News

‘బ్రహ్మోస్‌’ చాలా ఖరీదు

ABN , Publish Date - May 01 , 2026 | 05:54 AM

ఆధునిక యుద్ధ వ్యూహంలో అత్యాధునిక డ్రోన్లు, క్షిపణులు కీలక పాత్ర పోషిస్తున్న మాట వాస్తవమే అయినా..

‘బ్రహ్మోస్‌’ చాలా ఖరీదు

  • డ్రోన్లు, క్షిపణులకూ కొన్ని పరిమితులున్నాయి

  • జాతీయ భద్రతా సదస్సులో ఎయిర్‌ మార్షల్‌ అశుతోశ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30: ఆధునిక యుద్ధ వ్యూహంలో అత్యాధునిక డ్రోన్లు, క్షిపణులు కీలక పాత్ర పోషిస్తున్న మాట వాస్తవమే అయినా.. వాటికీ కొన్ని పరిమితులున్నాయని ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ అశుతోశ్‌ దీక్షిత్‌ అన్నారు. బ్రహ్మోస్‌ క్షిపణి అత్యంత ఖరీదైందని వ్యాఖ్యానించారు. డ్రోన్లు, క్షిపణులు పరిమిత సామర్థ్యం కలిగిన సాధనాలని, వాటిని వ్యూహాత్మకంగా వాడాలని చెప్పారు. గురువారం జరిగిన ఏఎన్‌ఐ జాతీయ భద్రతా సదస్సు 2.0లో దీక్షిత్‌ మాట్లాడుతూ.. యుద్ధాలు గెలవాలంటే సాంప్రదాయ పోరాట విధానం, డ్రోన్లు, క్షిపణుల సమన్వయంతో కూడిన సంయుక్త పోరాట విధానం అవసరమని స్పష్టం చేశారు. సాంప్రదాయ యుద్ధ విమానాలను డ్రోన్లు, క్షిపణుల వంటి నూతన సాంకేతికతతో అనుసంధానం చేయాలని ఆయన అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!

పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..

Updated Date - May 01 , 2026 | 05:54 AM