మీ శాలరీ కంటే మీ భర్త జీతం తక్కువ.. మహిళకు షాకిచ్చిన కోర్టు
ABN , Publish Date - Jul 26 , 2026 | 10:37 AM
విడాకుల కేసుకు సంబంధించి మధ్యంతర జీవన భృతి కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తాజాగా కొట్టేసింది.
ఇంటర్నెట్ డెస్క్: విడాకుల కేసుకు సంబంధించి మధ్యంతర జీవన భృతి కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తాజాగా కొట్టేసింది. మహిళ సంపాదన భర్త కంటే ఎక్కువగా ఉందని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, మహిళ 2011 నుంచి అమెరికాలో ఉంటున్నారు. న్యూఢిల్లీకి చెందిన ఒక సంస్థ తరఫున పనిచేస్తున్నారు. ఆమె భర్త కూడా ఐటీ రంగంలోనే ఉన్నారు. వారి ఇద్దరి పిల్లల్లో ఒకరు భర్త వద్ద మరొకరు భార్య వద్ద ఉంటున్నారు. మహిళ నెల జీతం ప్రస్తుతం 8,700 డాలర్లుగా (రూ.8లక్షలు) ఉంది. ఇది భర్త సంపాదన కంటే అధికం.
ఇదిలా ఉంటే, తనకు భర్త నెలకు రూ.1 లక్ష చొప్పున మధ్యంతర జీవనభృతి చెల్లించాలని కోరుతూ తొలుత మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆమె అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. లీగర్ ఖర్చుల కింద ఆమెకు రూ.25 వేలు చెల్లించాలని మాత్రం ఆదేశించింది.
దీన్ని సవాలు చేస్తూ మహిళ హైకోర్టును ఆశ్రయించారు. కానీ న్యాయస్థానం ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది. జీవనవ్యయాలు ఎక్కువగా ఉన్నాయన్న ఒక్క కారణంతో మధ్యంతర జీవనభృతిని కోరలేరని పేర్కొంది. ఐటీ రంగంలో ఉన్న భర్త ఉద్యోగం ఏఐ కారణంగా రిస్క్‌లో ఉందని పేర్కొంది. ఆ రంగంలో పోటీ కూడా ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇది ఆరంభం మాత్రమే.. అభిజీత్ దీప్కే మరో వీడియో
అస్సాంలో వరద బీభత్సం.. 66కు చేరిన మృతుల సంఖ్య..