ఇది ఆరంభం మాత్రమే.. అభిజీత్ దీప్కే మరో వీడియో
ABN , Publish Date - Jul 26 , 2026 | 09:41 AM
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్యానికి విజయమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. ఈ ఆందోళనలో అండగా ఉన్న యువత, విద్యార్థులను ఉద్దేశిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్యానికి విజయమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. ఈ ఆందోళనలో అండగా ఉన్న యువత, విద్యార్థులను ఉద్దేశిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇంతకాలం అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగిపోదని కూడా ఆయన చెప్పారు. మంత్రి రాజీనామా కేవలం ఆరంభం మాత్రమే అని కామెంట్ చేశారు. యువత, సీజేపీ మద్దతుదార్ల వల్లే ఇదంతా సాధ్యమైందని అన్నారు. బొద్దింకలు శాంతియుతంగా ఉద్యమించాయని ప్రశంసించారు. దీప్కే ప్రస్తుతం టైఫాయిడ్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాను టైఫాయిడ్ బారిన పడ్డ విషయాన్ని దీప్కే అంతకుముందు మరో వీడియోలో ధ్రువీకరించారు.
ఇక యువత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాను తప్పుకుంటున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ విషయంలో తాము తక్షణం స్పందించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. యువత ఆగ్రహాన్ని దేశవ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకోకూడదన్న ఉద్దేశంతో తాను తప్పుకుంటున్నట్టు చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
జేఎస్జేడీ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు..
సీజేపీ రాజకీయ పార్టీగా మారుతుందా.. సమాధానం ఏంటంటే..