Share News

విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న రేవంత్‌

ABN , Publish Date - Apr 20 , 2026 | 07:01 AM

ప్రధాని మోదీని రామాయణంలోని మారీచుడనే రాక్షసుడితో పోల్చి సీఎం రేవంత్‌రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిని అవమానించారని బీజేపీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్‌ పార్టీకి...

విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న రేవంత్‌

  • మోదీని మారీచుడితో పోల్చడంపై బీజేపీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19: ప్రధాని మోదీని రామాయణంలోని మారీచుడనే రాక్షసుడితో పోల్చి సీఎం రేవంత్‌రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిని అవమానించారని బీజేపీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్‌ పార్టీకి ద్వేషం గుర్తింపుగా నిలుస్తుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా ఆదివారం విడుదల చేసిన వీడియో మెసేజ్‌లో పేర్కొన్నారు. ‘ప్రధాని మోదీని లక్ష్యం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడి కంటే ఉన్నతస్థాయిలో ఉన్న అధిష్ఠానం నుంచి ఆదేశాలు వెళ్లాయి’ అని తనకు సమాచారం ఉందన్నారు. ద్వేష గీతాలు పాడుతున్న సీఎం రేవంత్‌.. విద్వేషాన్ని వ్యాప్తిచేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘సీతా మాతను అపహరించుకెళ్లేందుకు మారీచుడనే రాక్షసుడు వచ్చాడు. రాజ్యాంగాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రధాని మోదీ, బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ అన్ని ప్రయత్నాలు చేశాయి’ అని వ్యాఖ్యానించారు.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 07:01 AM