50 కార్ల కాన్వాయ్‌తో బీజేపీ నేత రయ్‌రయ్!
ABN , Publish Date - May 13 , 2026 | 05:27 AM
ఇంధనం పొదుపుగా వాడుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చి రెండు రోజులు కూడా కాకముందే మధ్యప్రదేశ్‌లో ఒక బీజేపీ నేత 50 కార్ల కాన్వాయ్‌తో అట్టహాసంగా వెళ్లడం...
భోపాల్, మే 12: ఇంధనం పొదుపుగా వాడుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చి రెండు రోజులు కూడా కాకముందే మధ్యప్రదేశ్‌లో ఒక బీజేపీ నేత 50 కార్ల కాన్వాయ్‌తో అట్టహాసంగా వెళ్లడం సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ పాఠ్యపుస్తకాల కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించేందుకు బీజేపీ నేత సౌభాగ్య సింగ్ ఠాకూర్ ఉజ్జయిని నుంచి భోపాల్‌కు సుమారు 50 ఎస్‌యూవీల కాన్వాయ్‌తో భారీ ర్యాలీగా వెళ్లారు. వెనుక ఇంకా పెద్దసంఖ్యలో మద్దతుదారుల వాహనాలూ ఉన్నాయి. అలంకరించిన వాహనాలు హైవేపై బారులుతీరి వెళ్తుండటం, ఎక్కడికక్కడ మద్దతుదారులు ఆయనకు స్వాగతం పలకడం వీడియోల్లో కనిపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కూడా స్పందించారు. ‘నిన్ననే మోదీజీ త్యాగాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపు విఫలమైందనేందుకు ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు. కాగా, ‘దేశం కోసం, ధర్మం కోసం 50 వాహనాల కాన్వాయ్‌తో వెళ్తున్నారు’ అని ఒక నెటిజన్ పోస్టు పెట్టారు. ‘నిబంధనలు కేవలం సామాన్యల కోసమే’ అని ఎక్కువ మంది నెటిజన్లు విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత