Share News

కేరళంలో ఆరుచోట్ల బీజేపీకి రెండో స్థానం!

ABN , Publish Date - May 06 , 2026 | 05:46 AM

కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా మూడు సీట్లు గెలుచుకున్న బీజేపీ మరో ఆరు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. తిరువళ్ల నియోజకవర్గం నుంచి...

కేరళంలో ఆరుచోట్ల బీజేపీకి రెండో స్థానం!

తిరువనంతపురం, మే 5: కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా మూడు సీట్లు గెలుచుకున్న బీజేపీ మరో ఆరు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. తిరువళ్ల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనూప్‌ ఆంటోనీ... కేరళ కాంగ్రెస్‌ (కేఈసీ) అభ్యర్థి వర్గీస్‌ మెమ్మెన్‌ చేతిలో 10,146 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక్కడ 2021 ఎన్నికల్లో బీజేపీ 16.25 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితం కాగా ఇప్పుడు 30.61 శాతం ఓట్లు సాధించింది. పాలక్కాడ్‌లో యూడీఎఫ్‌ అభ్యర్థి రమేశ్‌ పిషారోడి చేతిలో బీజేపీకి చెందిన శోభా సురేంద్రన్‌ 13,147 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ 2024 ఉప ఎన్నికలో బీజేపీకి 28.80 శాతం ఓట్లు లభించగా, ఈసారి 33.33 శాతం ఓట్లు దక్కాయి. ఇక అట్టింగల్‌లో సీపీఎం అభ్యర్థి ఓఎస్‌ అబింక కంటే బీజేపీ అభ్యర్థి పి.సుధీర్‌ 13,375 ఓట్లు వెనుకబడ్డారు. 2021లో ఈ స్థానంలో 25.92 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలవగా ఈసారి 30.54 శాతం ఓట్లను దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి:

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

Updated Date - May 06 , 2026 | 05:46 AM