Share News

బెంగాల్‌లో 9న కొలువుతీరనున్న బీజేపీ సర్కారు

ABN , Publish Date - May 07 , 2026 | 06:35 AM

పశ్చిమ బెంగాల్‌లో ఈ నెల 9న బీజేపీ ప్రభుత్వం కొలువుతీరనుంది. కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు...

 బెంగాల్‌లో 9న కొలువుతీరనున్న బీజేపీ సర్కారు

కోల్‌కతా, మే 6 : పశ్చిమ బెంగాల్‌లో ఈ నెల 9న బీజేపీ ప్రభుత్వం కొలువుతీరనుంది. కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్‌ భట్టాచార్య బుధవారం విలేకరులకు చెప్పారు. 9వ తేదీఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కాగా నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో గురువారం సమావేశం నిర్వహించనున్నారు. అయితే కాబోయే సీఎం ఎవరనే విషయంపై బీజేపీ నేతలెవరూ నోరు విప్పడం లేదు. మరోవైపు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఆయన తన మంత్రి వర్గ సహచరులతో కలిసి గవర్నర్‌ లక్ష్మణ్‌ ఆచార్యకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన హిమంత బిశ్వ శర్మ, కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 11 తర్వాతే ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

Updated Date - May 07 , 2026 | 06:35 AM