ధర్మేంద్ర ప్రధాన్‌కు అండగా ఉంటాం: బీజేపీ
ABN , Publish Date - Jul 26 , 2026 | 04:27 AM
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనల నేపథ్యంలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్టీ అండగా ఉంటుందని...
న్యూఢిల్లీ, జూలై 25 : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనల నేపథ్యంలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్టీ అండగా ఉంటుందని బీజేపీ ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ శనివారం సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ తీసుకున్న నిర్ణయం ప్రజాజీవితంలో అత్యున్నత స్థాయి నిజాయతీకి నిదర్శనమని కొనియాడారు. ‘‘ భారతదేశ విద్యా రంగంలో సంస్కరణలతోపాటు ఓ మైలురాయి వంటి జాతీయ విద్యా విధానాన్ని(ఎన్‌ఈపీ 2020) విజయవంతంగా అమలు చేయడంలో విద్యా శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. విశాల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ పదవి నుంచి తప్పుకోవడమనేది ప్రజా జీవితంలో అత్యున్నత స్థాయి నిజాయతీకి, నిస్వార్థమైన సేవాభావానికి నిదర్శనం. ఈ నిర్ణయం విషయంలో ధరేంద్ర ప్రధాన్‌కు బీజేపీ అండగా ఉంటుంది. ఆయన భవిష్యత్తు కార్యాచరణకు శుభాకాంక్షలు’’ అంటూ నితిన్ నబీన్ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు