Share News

మొసలిని భుజంపై మోస్తూ పోలీస్‌ స్టేషన్‌కి!

ABN , Publish Date - Aug 03 , 2026 | 06:37 AM

పొలంలోకి వచ్చిన మొసలిని ఏమాత్రం భయం లేకుండా ఓ రైతు తన భుజాలపై వేసుకుని ఏకంగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఈ వింత సంఘటన బిహార్‌లోని సుపౌల్‌ జిల్లాలో...

మొసలిని భుజంపై మోస్తూ పోలీస్‌ స్టేషన్‌కి!

బిహార్‌లో రైతు సాహసం.. నెట్టింట వీడియో వైరల్‌

సుపౌల్‌, ఆగస్టు 2: పొలంలోకి వచ్చిన మొసలిని ఏమాత్రం భయం లేకుండా ఓ రైతు తన భుజాలపై వేసుకుని ఏకంగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఈ వింత సంఘటన బిహార్‌లోని సుపౌల్‌ జిల్లాలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సుపౌల్‌ జిల్లాలోని ఓ గ్రామంలో రైతులు వరి పొలంలో పని చేస్తుండగా, పైర్ల మధ్య దాగి ఉన్న ఐదు అడుగుల మొసలిని గమనించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో వన్యప్రాణులపై దాడి చేస్తుంటారు. కానీ అమిత్‌ కుమార్‌ అనే రైతు, తోటి వారి సాయంతో మొసలి ఎవరిపైనా దాడి చేయకుండా దాని నోటిని తాడుతో కట్టేశాడు. తర్వాత ఏమాత్రం బెరుకు లేకుండా ఆ ఐదు అడుగుల మొసలిని తన భుజాలపైకి ఎత్తుకుని సమీపంలోని అటవీ శాఖ కార్యాలయానికి బయలుదేరాడు. అక్కడ అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో, అలాగే నడుచుకుంటూ భీమ్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లాడు. అటవీ సిబ్బంది స్టేషన్‌కు చేరుకుని మొసలిని తమ ఆధీనంలోకి తీసుకుని తర్వాత నదిలోకి విడిచిపెట్టారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 06:37 AM